తిరుపతిలోని టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పర్మిట్లు లేని వందలాది బస్సుల్లో వచ్చిన వేలాది మంది పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతున్నా కలెక్టర్, ఎస్పీ పట్టించుకోలేదన్నారు. తమ పరిధిలో లేదంటూ తమ ఫిర్యాదును పోలీసులు దాటవేయడం సరికాదన్నారు.
డీజీపీ సీసీ కెమెరాల ఫుటేజీలను చూస్తే నగరంలో ఏమి జరిగిందన్న వాస్తవాలు తెలుస్తాయన్నారు. పోలింగ్ ఏజెంట్లను, తమ పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి వత్తాసు పలికిన అధికారులపై తమ ప్రభుత్వం వచ్చాక చర్యలు తీసుకుని తీరుతామన్నారు.