తాను తెలంగాణాలోని కరీంనగర్‌కు చెందిన అమ్మాయనని పరిచయం చేసుకున్న సృజన, ప్రతి ఇంట్లో టెక్నాలజీ డెవలప్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ ఏఐ, ఎంఎల్ (మెషీన్ లెర్నింగ్) నేర్చుకోవాలి అన్నారు కదా , ఏఐ తదితర టెక్నాలజీలను మరింత అభివృద్ధి పరిచేందుకు విద్యా వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటువంటి విద్యా సంస్థల్లో ఐఐటీలను ఎలా భాగస్వాములను చేస్తారు? అని ప్రశ్నించింది.
అందుకు చంద్రబాబు బదులిచ్చారు. నువ్వు ఎపుడు పుట్టావమ్మా అని ఆ అమ్మాయిని అడిగారు. ఆ అమ్మాయి 1997లో సర్ అని వెల్లడించింది. అయితే, నువ్వు పుట్టడానికి రెండేళ్ల ముందే సీఎంను అయ్యాను.. నీది ఏ జిల్లా అని అడిగారు. కరీంనగర్ అని ఆ విద్యార్థిని వెల్లడించింది. అక్కడనుంచి చంద్రబాబు తన ప్రసంగం కొనసాగించారు.