బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

ఐవీఆర్

మంగళవారం, 25 మార్చి 2025 (22:16 IST)
ఇప్పుడు బీటెక్ చేస్తున్న విద్యార్థుల్లో కొందరు అసలు వారు ఏం చదివారు, వారు చదివిన చదువుల్లో వున్న నాలెడ్జ్ లేకుండా డిగ్రీలు పట్టుకుని బైటకు వస్తున్నారనీ, వీళ్లు ఎందుకూ పనికిరావడంలేదంటూ చెప్పారు తెలంగాణ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఆయన అసెంబ్లీలో విద్యార్థులు-చదువులు-కేరీర్ గురించి మాట్లాడారు.
 
ఈరోజుల్లో ఏడాదికి వేలల్లో బీటెక్ విద్యార్థులు డిగ్రీలు పట్టుకుని వస్తున్నారు. కానీ ఏం ప్రయోజనం.. వారిలో చాలామందికి సబ్జెక్టుకి సంబంధించి నాలెడ్జ్ వుండటంలేదు. వాళ్లు ఏం చదివారన్నది తెలియడంలేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ వుండవు. టెక్నికల్ నాలెడ్జ్ అసలే వుండదు. వారు చదివిన చదువుకు సంబంధించి ఉద్యోగాల్లో చేరినా రాణించలేకపోతున్నారు. ఇలాంటి చదువులా మన విద్యార్థులు చదువుతున్నది అంటూ ప్రశ్నించారు కూనంనేని సాంబశివరావు.

బీటెక్ వాళ్లు ఎందుకు పనికొస్తారు?

కొందరు బీటెక్ పిల్లలకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు. కనీసం కమ్యూనికేషన్ ఉండదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. ఏం చేయాలో తెలియదు. భవిష్యత్‌లో ఎందుకు పనికొస్తారు?

ఇటువంటి చదువులా మన చదువులు

- ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు@HiHyderabad @BodaSumant98779pic.twitter.com/7GgJuqoiY7

— Telugu Galaxy (@Telugu_Galaxy) March 25, 2025

వెబ్దునియా పై చదవండి