తణుకు పోలీస్ స్టేషన్ వద్ద మహిళా అఘోరీ హల్చల్ - ఆత్మహత్యాయత్నం! (Video)

ఠాగూర్

సోమవారం, 3 మార్చి 2025 (15:45 IST)
తణుకు పోలీస్ స్టేషన్ వద్ద మహిళా అఘోరీ హల్చల్ సృష్టించారు. అఘోర రాజేష్ నాథ్‌పై ఫిర్యాదు చేసేందుకు ఆమె వెళ్లారు. అయితే, ఆ మహిళా అఘోరీ ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తన ఫిర్యాదును స్వీకరించాలంటూ ఆమె పట్టుబట్టినప్పటికీ వారు ఏమాత్రం స్వీకరించలేదు. దీంతో అఘోరీ పోలీసుల తీరుకు నిరసనగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శరీరంపై పెట్రోల్ పోసుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు... ఆమెపై నీళ్ళు పోశారు. మహిళా కానిస్టేబుళ్ల సాయంతో పోలీసులు మహిళా అఘోరీని రక్షించారు. 
 
కాగా, అఘోర ముసుగులో రాజేష్ నాథ్ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆమె ఆరోపిస్తున్నారు. దీంతో తణుకు బ్యాంకు కాలనీలో రాజేష్ నాథ్ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళి, హల్చల్ సృష్టించింది. 

 

తణుకు PS వద్ద అఘోరీ హల్చల్

అఘోర రాజేష్ నాథ్ పై ఫిర్యాదు చేయడానికి తణుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అఘోరీ

అఘోరీ ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించిన పోలీసులు

దీంతో పోలీసుల తీరుపై అఘోరీ ఆగ్రహం

పోలీసుల ముందే ఆత్మహత్యాయత్నం చేసిన అఘోరీ https://t.co/QP9tBlEVKZ pic.twitter.com/J5mH8ErFng

— BIG TV Breaking News (@bigtvtelugu) March 3, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు