నెల్లూరు జిల్లా కావలిలో ఓ నిండు గర్భిణి బస్సు దిగుతుండగా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ బిడ్డ బస్సు ఫుట్‌బోర్డు చివరి మెట్టుపై పడగా, ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. అలాగే, తల్లి కూడా ప్రాణాలు విడిచింది. ఈ దుర్ఘటన సోమవారం జరిగింది.
నిండుగర్భిణిగా ఉన్న అంకమ్మ సోమవారం వారి పుట్టింటికి వెళ్లాలని భర్తతో కలిసి ఆత్మకూరులో బస్సు ఎక్కింది. కావలిలో బ్రిడ్జిసెంటర్‌లో బస్సు దిగుతున్న సమయంలో ఆమెకు తెలియకుండానే గర్భసంచిలో నుంచి చనిపోయిన పాప బస్సు దిగేసమయంలోనే చివరి మెట్టుపై పడిపోయింది. కానీ ఆ బిడ్డను వారు గమనించలేదు. బస్సు దిగగానే ఆమెకు కళ్లు తిరగడంతో భర్త ఆసుపత్రికి తీసుకెళ్లాడు.