అయితే, భర్త సంపాదన నిమిత్తం బయటకు వెళ్లేవాడు. దీంతో పావని రెడ్డి ఒక్కటే ఇంట్లో ఉండేది. ఆ సమయంలో కాలక్షేపం కోసం ఓ డమ్మీ ఐడీ క్రియేట్ చేసుకుని దాంతో చాటింగ్ చేయడం మొదలెట్టింది. ఈ క్రమంలో మదనపల్లిలోని బజాజ్ షోరూం యజమానిగా సుజిత్ అనే యువకుడు పరిచయం అయ్యాడు.
వీరిద్దరి మధ్య సాగుతూ వచ్చిన స్నేహం చివరకు ప్రేమగా మారి నగలు, డబ్బు, స్కూటీ వంటి విలువైన బహుమతులను పావనికి అందించే స్థాయికి చేరింది. ఆ తర్వాత వీరిద్దరు ఒరిజినల్ ఫోటోలు షేర్ చేసుకోవాలని ఇద్దరూ అనుకుని ఆ ప్రకారంగానే ఫోటోలు షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలు చేసిన సుజిత్... పావనికి పెళ్లై పోయిందన్న విషయం తెలుసుకుని షాక్‌కు గురయ్యాడు.
దీంతో తాను ఆమెపై ఖర్చు పెట్టిన రూ.2 లక్షలనూ ఇవ్వకుంటే రచ్చ చేస్తానని బెదిరించాడు. చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో బ్యాంక్ కోచింగ్‌కు వెళుతున్నానని చెప్పిన పావని మదనపల్లికి చేరుకుని, తన వద్ద ఉన్న రూ.15 వేలు తీసుకుని ఈ విషయం గురించి మరచిపోవాలని సుజిత్‌ను వేడుకుంది.
అయితే, తాను మోసపోయిన విషయాన్ని జీర్ణించుకోలేని సుజిత్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పావని బలవన్మరణానికి పాల్పడింది. దీనిపై చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.