అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

ఠాగూర్

గురువారం, 3 ఏప్రియల్ 2025 (17:02 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు శుభవార్త చెప్పింది. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చే నిధుల్లో తొలివిడతగా రూ.3,535 కోట్లను గురువారం విడుదల చేసింది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు రూ.6,700 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా తొలి విడత నిధులను గురువారం ప్రభుత్వ ఖాతాలో జమ చేసింది. దీంతో అమరావతి నిర్మాణంలో ఒక ముఖ్యమైన ముందడుగు పడినట్టయింది. 
 
నిజానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాలు గత డిసెంబరు నెలలోనే ఆమోదం పొందాయి. ఆ క్రమంలో ఈ సంవత్సరం జనవరిలోనే బ్యాంకుల నుంచి మొదటి విడత నిధులు రావాల్సివుంది. అయితే, అమరావతి రాజధానిగా పనికిరాదని రుణం ఇచ్చేందుకు కొందరు ఆ బ్యాంకులకు లేఖలు రాశాయి. ఈ అభ్యంతరాల నేపథ్యంలో వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు రెండు నెలలు ఆలస్యమైంది. చివరికి మొదటి విడత నిధులు విడుదల కావడంతో అమరావతి రాజధాని పనులు వేగవంతం చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు