కరోనాపై చేతులెత్తేసిన సీఎం జగన్.. వైకాపా నేతల మధ్య చర్చ.. వీడియో లీక్

గురువారం, 6 మే 2021 (12:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విశ్వరూపందాల్చింది. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఫలితం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్ర స్థాయికి చేరింది. పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక అనేక మంది రోగులు మృత్యువాతపడుతున్నారు.
 
ఇదిలావుంటే, కరోనా రోగుల నుంచి ప్రైవేటు ఆస్పత్రుల యజమాన్యాలు ఇష్టానుసారంగా వసూళ్ళకు పాల్పడుతున్నాయి. అలాగే, ఆంబులెన్స్ డ్రైవర్లు కూడా చేతికందినంత వరకు దోచుకుంటున్నారు. రాష్ట్రంలో ఎంతగా దిగజారిపోయో ఇలాంటి సంఘటనలు చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి చేతులెత్తేశారంటూ స్వయంగా వైసీపీ నేతలే మాట్లాడుకుంటుండం సంచలనంగా మారింది. రాజమండ్రిలో సమావేశమైన వైసీపీ ఎంపీలు, నేతలు కరోనా సంక్షోభం గురించి మాట్లాడుకున్నారు. 
 
కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను తరలించడానికి రూ.30 వేలు, దహనసంస్కారాలకు రూ.12 వేలు తీసుకుంటున్నారని వైసీపీ నేతలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని అభిప్రాయపడ్డారు. సీఎం ప్రవర్తనతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైసీపీ నేతలు మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు