ఆధిపత్యం కోసమే మత్స్యకారుల మధ్య వైసీపీ చిచ్చు: కొల్లు రవీంద్ర

బుధవారం, 16 డిశెంబరు 2020 (06:17 IST)
చీరాల నియోజకవర్గంలో కఠారిపాలెం, వాడరేవు గ్రామాలకు చెందిన మత్స్యకారుల మధ్య, వలలవాడకం విషయంలో జరిగిన గొడవ దురదృష్టకరమని, కొందరువ్యక్తులు, కొన్ని రాజకీయశక్తులు తమ స్వార్థంకోసం ఈ గొడవరేకెత్తేలా చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆక్షేపించారు.

ఆయన తననివాసం నుంచి  జూమ్ యాప్ ద్వారావిలేకరులతో మాట్లాడారు. జరిగినవివాదంలో అమాయకులైన మత్స్యకారులు కేసుల్లోఇరుక్కున్నారని, మరి కొందరు తీవ్రగాయాలపాలయ్యారని, రవీంద్ర తెలిపారు.

కొందరు వైసీపీనేతలు వారి వర్గాలను వారు పెంచిపోషించుకోవడానికి, ఇటువంటి సంఘటనలను ప్రోత్స హించడం జరిగిందన్నారు. చేపలవేటే ప్రధాన జీవనాధారంగా దానిపైనే  ఆధారపడి బతుకుతున్న మత్య్సకార గ్రామాల మధ్యన స్వార్థపరులుపెట్టిన చిచ్చుకారణంగా జరగరాని నష్టం జరిగింద న్నారు. 

ప్రశాంతంగా ఉన్న మత్స్యకారులను రెచ్చగొట్టడం, వారిలో వారికే వివాదాలు సృష్టించడం, ఆస్తులవిధ్వంసం జరగడం బాధాకరమని రవీంద్ర వాపోయారు. ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరామ్ లు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడంకోసం, మత్స్యకారులను తమ వైపుకు తిప్పుకోవాలన్న దురాలోచనతోనే  కొందరు వ్యక్తులు వివాదాన్ని రాజేశారన్నారు.

మత్స్యకారులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, అధికారులు , అక్కడున్న సమస్యలను పరిష్కరిం చకుండా, కాలయాపన చేయడంవల్లే పరిస్థితి పూర్తిగా చేయిదాటిం దని రవీంద్ర స్పష్టంచేశారు. టీడీపీప్రభుత్వం వేటనిషేధ సమయంలో ప్రతిమత్స్యకారకుటుంబానికి రూ.4వేలవరకు పరిహారం ఇవ్వడంజరిగిందని, వేటాడటంకోసం వలలు, పడవలను  కూడా ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు.

పేద, మధ్యతరగతికి చెందిన మత్స్యకారుల్లో 50ఏళ్లు పైబడినవారికి పింఛన్లు కూడా టీడీపీ ప్రభుత్వం అందించిందన్నారు. ఇళ్లపథకాలు, పడవలకు ఆయిల్ పై సబ్సిడీలు ఇవ్వడం కూడా చేశామన్నారు. అటువంటివే వీ చేయకపోగా, ఈప్రభుత్వం వారిలోవారికే మనస్పర్థలు సృష్టించి, కలిసిమెలిసి ఉన్నవారిని కాట్లాడుకునేలా చేసిందన్నారు.

13కులాలుగా ఉన్న మత్స్యకారులను చీల్చి, వారిలో వారే తగవులుపడేలా చేయడం బాధాకరమన్నారు. బీసీలంతా కలిసుంటే, తమఆటలుసాగవనే వైసీపీప్రభుత్వం ఇటువంటి విష రాజకీయాలు చేస్తోందన్నారు.   వైసీపీనేతలు తమ రాజకీయ ఆధిపత్యంకోసమే ఈ దారుణానికి తెగబడ్డారని రవీంద్ర తేల్చిచెప్పారు.

జరిగిన దారుణంపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. చీరాలలో మొదలైన చిచ్చుని ఆదిలోనే ఆపకపోతే, చుట్టుపక్కల గ్రామాలు, తరువాత రాష్ట్రమంతా వ్యాపించే ప్రమాదం లేకపోలేద న్నారు.

అధికారపార్టీ ఎంపీ ఎదుటే వివాదం తారాస్థాయికిచేరిందని, పోలీసులు కూడా మత్స్యకార గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితులు లేవని, ప్రభుత్వం సీరియస్ గా ఘటనపై దృష్టిసారించకపోతే ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశముందని రవీంద్ర హెచ్చరించారు. 

చిన్నవివాదంగా భావించివదిలేయడం మంచిదికాదని, సామరస్యంగా సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని, వివాదానికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత అధికారులపై, ముఖ్యమంత్రిపై ఉందని మాజీమంత్రి తేల్చిచెప్పారు.

తీరప్రాంతంలో ఐకమత్యంగా జీవించే మత్స్యకారులను తమస్వార్థంకోసం ఇబ్బందులకు గురిచేయడం ఎవరికీ మంచిదికాదని ఆయన హితవుపలికారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు