నీకిప్పటికే 55 ఏళ్లొచ్చాయి గాడిదకొచ్చినట్లు, మాజీమంత్రి రోజా కామెంట్స్ వైరల్: తదుపరి అరెస్ట్ ఈమేనా?

ఐవీఆర్

గురువారం, 27 ఫిబ్రవరి 2025 (16:37 IST)
సభ్యత మర్చిపోయి, మంచీమర్యాద లేకుండా నోటికి వచ్చిందల్లా మాట్లాడి కటకటాల పాలయ్యాడు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. ఆయన మాట్లాడిన పాత బూతు వీడియోలు చూస్తుంటే... తమకు రక్తం సలసలా మరుగుతుంటుందని జనసైనికులు అంటున్నారు. పోసాని విషయం అలా వుంచితే... ఇప్పుడు ట్విట్టర్లో మాజీమంత్రి రోజా గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్‌లను తిడుతూ వున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
 
పవన్ కల్యాణ్ పైన ఆమె విమర్శలు చేస్తూ... నీకిప్పటికే 55 ఏళ్లొచ్చాయి గాడిదకొచ్చినట్లు అని మొదలుపెట్టి చెడామడా మాట్లాడేశారు. ఇంకా మంత్రి నారా లోకేష్ పైన అయితే మరీ దారుణంగా రాయలేని భాషలో తిట్లదండకాన్ని ఎత్తుకున్నారు రోజా. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతుండటంతో నెక్ట్స్ టార్గెట్ రోజానేనా అంటూ నెటిజన్లు పలువురు కామెంట్లు పెడుతున్నారు.

దీన్ని ఎప్పుడు ?
స్థాయి మర్చిపోయి, అధినేతలని వాడు వీడు, వారి ఇంట్లో ఆడవాళ్ళని అది ఇది..

ఇలాంటి వాళ్ళని లోపలేసినా అయ్యో పాపం అనేవాళ్ళు లేరు. కక్ష సాధింపు కానే కాదు..@PawanKalyan @ncbn @naralokesh pic.twitter.com/PvbFUGIKKF

— Twood Trolls ™ (@TT_2_0) February 26, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు