రాష్ట్రంలో నెలకొన్న వివిధ పరిస్థితులపై ఫిబ్రవరి 13న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖరాసినట్టు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జగన్ తెలిపారు. చంద్రబాబు తన అధికారంతో వ్యవస్థలను మేనేజ్ చేస్తుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. అధికారులను ఏపీ సీఎం ప్రలోభపెట్టి తప్పుల మీద తప్పులు చేయిస్తున్నారని ఆరోపించారు.
ఇటీవల దిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో గంటపాటు వివిధ అంశాలపై మాట్లాడినట్టు జగన్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఆయనతో 10-15 నిమిషాలు మాట్లాడినట్టు చెప్పారు. అగ్రిగోల్డ్, మిర్చి రైతుల సమస్యలపైనా మోదీతో చర్చించినట్టు జగన్ తెలిపారు.
అమరావతి వ్యవసాయోత్పత్తుల రేట్లు రైతు దగ్గర నుంచి వ్యాపారుల వరకు వెళ్లేసరికి మారుతున్నాయని, దళారులు, వ్యాపారులు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వైకాపా అధినేత జగన్ అన్నారు. 92 లక్షల క్వింటాళ్లు పండితే కనీసం 50 లక్షల క్వింటాళ్లు రైతుల నుంచి కొనుగోలు చేయాలన్నారు.