రాజకీయాలకు గుడ్‌బై.. తొలగిపోతున్న జగన్ ఫ్లెక్సీలు... కేశినేని నాని ఇక అంతేనా?

వరుణ్

మంగళవారం, 11 జూన్ 2024 (13:24 IST)
తాను రాజకీయాలను నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు విజయవాడ మాజీ ఎంపీ, వైకాపా నేత కేశినేని నాని ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ఆయనకు చెందిన భవనాలపై ఏర్పాటు చేసిన వైకాపా, జగన్ ఫ్లెక్సీలు ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. తన ప్రకటన తర్వాత ఆయన విజయవాడలోని కేశినేని భవనంపై ఏర్పాటు చేసిన వైఎస్ జగన్‌తో దిగిన బోర్డులను కేశినేని నాని కార్యాలయ సిబ్బంది తొలగిస్తున్నారు. ఆ బోర్డుల స్థానంలో ఏ బోర్డులు ఏర్పాటు చేస్తారనది ఇపుడు ఆసక్తిగా మారింది. 
 
విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకున్నారు. వైసిపి నుంచి తన సోదరుడు కేశినేని చిన్నిపై ఓడిపోయారు. ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసిపి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని విశ్వసించిన కేశినేని నాని ఆ పార్టీలో చేరి విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసారు. ఐతే ఓటమి పాలయ్యారు. దీనితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తను రాజకీయాలకు దూరంగా వుండదలుచుకున్నాననీ, ఐతే ప్రజాసేవ మాత్రం చేస్తూనే వుంటానని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. 

 

నిన్న రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన కేశినేని నాని

నిన్నటి ప్రకటన తరువాత కేశినేని భవన్ పైన ఏర్పాటు చేసిన వైఎస్ జగన్‌తో దిగిన బోర్డులు మొత్తం తీస్తున్న కేశినేని నాని కార్యాలయ సిబ్బంది.

ఆ బోర్డుల స్థానంలో ఏ బోర్డులు ఏర్పాటు చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజయవాడ… pic.twitter.com/FGOk5QzlzL

— Telugu Scribe (@TeluguScribe) June 11, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు