ఇటీవల వరద బాధిత జిల్లాలైన చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరుల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా, చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని సరస్వతి నగర్ పర్యటన సమయంలో అనేక మంది ముఖ్యమంత్రితో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపించారు.