క్షమాపన చెప్పింది జగన్ అయితే చెప్పించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్. ఇప్పటికే ఆయన పెట్టిన పార్టీ నుంచి బహిష్కరించేశారు జగన్. దీంతో న్యాయపోరాటానికి సిద్థమయ్యారు. కోర్టుకు వెళ్ళారు.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 11వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు.
ఇక వేరే చేసేది లేక జగన్, శివకుమార్‌ను పిలిపించుకుని జరిగిందేదో జరిగిపోయింది. పార్టీ కోసం కష్టపడు. నువ్వు కూడా నాయకుడివే. కలిసి చేసుకుందామంటూ బుజ్జగించి క్షమాపణ చెప్పి పంపేశారట. ఏకంగా జగనే సారీ చెప్పడంతో శివకుమార్ శాంతించినట్లు తెలుస్తోంది. ఈ నెల 11వ తేదీ ఎన్నికల కమిషనర్ దగ్గరకు వెళ్ళి తాను చేసిన ఫిర్యాదును శివకుమార్ వెనక్కి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.