మరోవైపు తన పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం దీక్షతో ఒత్తిడి పెరుగుతుందని భావించిన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఎంపీలు రాజీనామా చేయడంతో మైలేజీ వచ్చిందని భావించిన జగన్, సీఎం దీక్ష రోజు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేస్తే.. అన్నీ విషయాలకు కలిసివస్తుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.