అన్నదాత సుఖీభవగా పేరు మార్చుకున్న రైతు భరోసా పథకం

సెల్వి

బుధవారం, 26 జూన్ 2024 (11:25 IST)
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవ పథకంగా పేరు మార్చింది. ఈ మేరకు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
అన్నదాత సుఖీభవ పథకం కింద, ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ప్రభుత్వం సంవత్సరానికి రూ. 20,000 (రూ. 6,000 కేంద్ర & రూ. 14,000 రాష్ట్రం) ఆర్థిక సహాయం అందిస్తుంది. 
 
మునుపటి వైకాపా ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు ఆర్థిక సహాయంగా సంవత్సరానికి రూ. 13,500 (రూ. 6,000 కేంద్రం రూ. 7,500) అందించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు