ఏపీలోని అధికార వైకాపాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదే పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు సూటిగా ఓ ప్రశ్న సంధించారు. నేను గనుక సీఎం అయితేవుంటే టీడీపీలో చంద్రబాబు మినహా ఇంకెవ్వరూ మిగిలివుండరంటూ ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. అసలు ఈ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
నా గెలుపునకు వైఎస్ విజయమ్మ, షర్మిల, జగన్ ఫొటోలు ఉంటే నా వ్యక్తిగత ఇమేజ్ కూడా తోడైంది. నేను సీఎం జగన్‌ను ఎప్పుడూ విమర్శించలేదు. ప్రభుత్వ పాలసీలను, విధానాలను, తప్పుచేస్తున్న వారిని మాత్రమే విమర్శించానని, ఇకపై కూడా విమర్శిస్తానని తెలిపారు.
పైగా, గత ఎన్నికల్లో 'నా కాళ్లు పట్టుకొని బతిమాలితే నేను జగన్ పార్టీలో చేరాను. జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డిల దయవల్ల నువ్వు మంత్రి అయ్యావ్. ఇసుక ద్వారా ఎన్నివేల కోట్లు సంపాదిస్తున్నావో ప్రజలకు తెలుసు అని ఘాటుగా వ్యాఖ్యానించారు.