శాసనమండలి ఓ గుదిబండ : ఆ పత్రిక కథనాన్ని పోస్ట్ చేసిన విజయసాయి

మంగళవారం, 28 జనవరి 2020 (10:40 IST)
శాసనమండలి ఓ గుదిబండ అని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. పైగా, గతంలో శాసనమండలి అవసరం లేదంటూ ప్రముఖ తెలుగు దినపత్రిక 37 యేళ్ల క్రితం రాసిన ఎడిటోరియల్ కథనాన్ని ఆయన పోస్ట్ చేస్తూ, పచ్చ మీడియాకు విధానాలు ఉండవని సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 
 
ఇదే అంశంపై విజయసాయి రెడ్డి ఓ ట్వీట్ చేశారు. "ఎల్లో మీడియాకు నిర్ధిష్ట విధానాలంటూ ఏముండవు. జాతి ఆశాకిరణం చంద్రబాబు ఏ లైన్ తీసుకుంటే దాన్ని అనుసరించడమే వాటికి తెలిసిన జర్నలిజం. అప్పట్లో కౌన్సిల్ దండగని ఎడిటోరియల్స్ రాసిన పచ్చ పత్రికలు ఇప్పుడు భిన్నంగా రాసి 'జ్ఞానాన్ని' వెదజల్లుతున్నాయి" అని ఆయన అన్నారు.
 
కాగా, 1983, మార్చి 28, సోమవారం ప్రచురితమైనట్టుగా కనిపిస్తున్న ఈ ఎడిటోరియల్ వ్యాసంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు వల్ల ఏదో జరగరాని ప్రమాదం జరిగినట్టు గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడటం గమనార్హం. 

 

ఎల్లో మీడియాకు నిర్ధిష్ట విధానాలంటూ ఏముండవు. జాతి ఆశాకిరణం చంద్రబాబు ఏ లైన్ తీసుకుంటే దాన్ని అనుసరించడమే వాటికి తెలిసిన జర్నలిజం. అప్పట్లో కౌన్సిల్ దండగని ఎడిటోరియల్స్ రాసిన పచ్చ పత్రికలు ఇప్పుడు భిన్నంగా రాసి ‘జ్ఞానాన్ని’ వెదజల్లుతున్నాయి. pic.twitter.com/o4ep60NvXE

— Vijayasai Reddy V (@VSReddy_MP) January 28, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు