సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వంపై కన్నడ ప్రజలకు మంచి నమ్మకం ఉండబట్టే కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కర్నాటక ఎన్నికల ఫలితాలపై సీఎం కిరణ్ స్పందిస్తూ సోనియా, రాహుల్ నాయకత్వంపై నమ్మకం ఉంచి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలుగా ఓటేసిన ఆ రాష్ట్ర ప్రజలకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చినందుకు కర్ణాటక రాష్ట్ర ఓటర్లందరికీ, ముఖ్యంగా అక్కడి తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఆయన విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ విజయానికి కృషి చేసిన కర్నాటక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు కూడా ఆయన అభినందనలు తెలిపారు.