మూడవ విడత పోలింగ్ ప్రారంభం

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడవ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఇందులో మొత్తం 170 లోక్‌సభ సీట్లకుగాను గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. గురువారం ఉదయం ఏడు గంటలనుంచి పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు లైన్లలో నిలబడి ఉండటం గమనార్హం. దేశంలోని ప్రముఖులు అనిల్ అంబానీ, మాయావతిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మూడవ విడతలో భాగంగా దేశంలోనే అతి పెద్దవైన రెండు ప్రధాన ప్రతిపక్షాల నాయకులు సోనియా గాంధీ, ఎల్‌.కే. అద్వానీలతోబాటు మొత్తం 1567మంది అభ్యర్థులు లోక్‌సభ సీట్లకోసం పోటీలు పడుతున్నారు. ఇందులో భాగంగా 107 లోక్‌సభ సీట్లకుగాను మహిళా అభ్యర్థులు 101మంది పోటీ పడుతుండటం విశేషం. కాగా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 14కోట్ల 40లక్షలమంది చేతిలో వీరి భవితవ్యం ఉంది.

ఈ సందర్భంగా జరిగే పోలింగ్‌లో దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో పోలింగ్ జరుగుతోంది. ఇందులో అత్యధికంగా గుజరాత్‌లో 26 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. మధ్యప్రదేశ్(16), ఉత్తరప్రదేశ్(15) పశ్చిమ బెంగాల్(14), బీహార్(11), కర్ణాటక(11), మహారాష్ట్ర(10). సిక్కిం, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలలో చెరి ఒక స్థానం కాగా దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ కేంద్ర ప్రాంత ప్రాంతాలలో చెరి ఒక పార్లమెంట్ స్థానానికి పోటీలు జురుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్-బీజేపీల మధ్యే పోటీ తీవ్రంగా ఉన్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి