నేడు 'మెగా' ఆవిర్భావం

తెలుగు ప్రజలలను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 'మెగా' పార్టీకి గంటల వ్యవధిలో ఆవిర్బావించనున్నది. కొన్ని నెలలుగా ఉన్న ఉత్కంఠకు మంగళవారం సాయంత్రానికి తెరపడనున్నది. చిరంజీవి ఇక్కడ నుంచి పార్టీ, జెండా, అజెండాలను ప్రకటిస్తారు. అప్పటి నుంచి నేరుగా చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేసినట్లే.

తిరుపతి నగరం అవిలాల చెరువులో భారీ ఎత్తున బహిరంగ సభకు అన్ని సిద్ధం చేశారు. అయితే ఎక్కడేగాని పార్టీ జెండా రంగు ఆనవాళ్ళు ఊహించడానికి కూడా అవకాశం లేకుండా జాగ్రత్తపడ్డారు. ఒక్కసారిగా అన్నింటిని తెరపైకి తీసుకురావాలన్నది మెగా శిబిరం ఆలోచన. అందుకే అన్నింటిలోనూ మంగళవారం సాయంత్రం వరకూ ఈ ఉత్కంఠను కొనసాగిస్తున్నారు.

భారీ ఎత్తున చిరంజీవి అభిమానులు ఇప్పటికే అవిలాల చెరువుకు చెరుకున్నారు. దాదాపు 15 లక్షల మంది జనానికి ఏర్పాట్లు సిద్ధం చేశామని చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ప్రకటించారు. ఇక్కడ ఇప్పటికే దాదాపు లక్షమంది జనం సభాస్థలికి చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా చిరు శిబిరం వైద్య ఏర్పాట్లు చేస్తున్నారు.

సభకు వికలాంగులు దాదాపుగా 18 అంబులెన్సులు దగ్గరలో ఉంచారు. పైగా 40 మంది డాక్టర్ల బృందం ఒకటి సభాస్థలికి అందుబాటులో ఉంటుంది. ఎండ అధికంగా ఉండడంతో ఎవ్వరైనా సొమ్మసిల్లినా, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వెంటనే వైద్య సేవలు అందించేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులను నియంత్రించడానికి వేలాది మంది వాలంటీర్లు అక్కడికి చేరుకున్నారు.

వెబ్దునియా పై చదవండి