శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ బ|| సప్తమి సా.4.35 మూల రా.7.03 సా.వ.5.28 ల 7.03 తె.వ.4.27 ల 6.01. ప. దు. 12. 27 ల 1.16 పు.దు. 2.53ల3.42.
మేషం :- ఓర్పు, నేర్పుతో వ్యవహరించటం ఎంతైనా అవసరం. ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహరాల్లో తలమునకలవుతారు. విద్యార్ధినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. క్రీడా, కళా,సాంస్కృక రంగాల పట్ల ఆశక్తి వహిస్తారు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అలౌకి విషయాలు, ఆరోగ్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది.
వృషభం :- సంకల్ప బలం ముఖ్యమని తెలుసుకోండి. బ్యాంకింగ్ వ్యవహరాలు, ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. స్త్రీ సౌఖ్యం, ఆకస్మిక ధనప్రాప్తి పొందుతారు. సమయానికి సహకరించని మిత్రుల వైఖరి నిరుత్సాహపరుస్తుంది. కోర్టు వ్యవహరాలు ఒక పట్టాన తేలకపోవటంతో అసహనం తప్పదు.
మిథునం :- దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. కొత్త ప్రదేశానికి ప్రయాణం చేయవలసి వస్తుంది. ఎల్.ఐ.సి, పోస్టల్, ఇతర ఏజెంట్లకు, బ్రోకర్లకు పనిభారం అధికమవుతుంది. సాంఘిక, సంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
కర్కాటకం :- వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. దంపతుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. సహోద్యోగులతో సఖ్యత లోపిస్తుంది. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది.
సింహం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మిత్రులు కూడా మీకు దూరంగా ఉండటానికి యత్నిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొనవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. విలాసాలకు, ఆడంబరాలకు వ్యయం చేసే విషయంలో ఆలోచన, పొదుపు అవసరం.
కన్య :- ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. నిదానంగానైనా మీరు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభించగలవు.
తుల :- గృహం ఏర్పరుచుకోవాలనే కోరిక బలపడుతుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. విద్యుత్ రంగంలో వారికి పని భారం అధికం. ఉద్యోగస్తులు నిర్లక్ష్య ధోరణి వల్ల, మతిమరుపు వల్ల అధికారులతో మాటపడక తప్పదు. దైవ కార్యాలల్లో పాల్గొంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
వృశ్చికం :- మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. కుటుంబంలోను, బయటా ఊహించిన సమస్యలు తలెత్తుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మార్కెటింగ్ రంగాల వారికి ఓర్పు, అంకితభావం చాలా అవసరమని గమనించండి. ప్రయాణాలను అనుకూలిస్తాయి.
ధనస్సు :- భాగస్వామిక చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలలో మెళకువ అవసరం. సేవా సంస్థలు పేద విద్యార్థులకు సహాయం అందిస్తారు. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం, మంచి గుర్తింపు లభిస్తాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది మీ నుండి ధనసహాయం కోరవచ్చు.
మకరం :- శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. పరిశోధనాత్మక విషయాలపై ఆశక్తి చూపుతారు. ఉపాధి పథకాల దిశగా నిరుద్యోగుల ఆలోచనలు ఉంటాయి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికిరాగలవు.
కుంభం :- రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బంధుత్వాల మధ్య ఏర్పడిన సందిగ్ధ పరిస్థితులు తీరిపోతాయి. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఏమరుపాటుతనం వల్ల ఇబ్బందులు తప్పవు. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనుకూలించదు.
మీనం :- ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగ రీత్యా నూతన పరిచయాలేర్పడతాయి. బంధువులను కలుసుకుంటారు. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.