02-06-202 ఆదివారం దినఫలాలు - స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం...

రామన్

ఆదివారం, 2 జూన్ 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ ఐ|| ఏకాదశి రా.1.29 రేవతి రా.12.54 ప.వ.1.42 ల 3.11. సా.దు. 4.43 ల 5.35.
 
మేషం :- చేతి వృత్తులు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ఎదుటివారి తీరును గమనించి వ్యవహరించండి. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. 
 
వృషభం :- ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. రాజకీయనాయకులకుప్రయాణాలలో మెళుకువ అవసరం. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. 
 
మిథునం :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఇతరులతో అతిగా మాట్లాడటంమీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. మీ సంతానం మీతో అన్ని విషయాల్లోను ఏకీభవిస్తారు.
 
కర్కాటకం :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చల్లో కొత్త ప్రతిపాదనలు చోటు చేసుకుంటాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. 
 
సింహం :- వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. రవాణా రంగాలలోని వారికి మెళుకువ అవసరం. నిరుద్యోగులకు ఎటు వంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకొండి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. మొక్కుబడులు, దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కన్య :- స్త్రీలు తమ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. మనుష్యుల మనస్థత్వము తెలిసి మసలు కొనుట మంచిది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. రాజకీయ నాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి.
 
తుల :- బంధువుల రాకపోకలు అధికం. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. నూతన పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. సాహస ప్రయత్నాలు విరమించండి.
 
వృశ్చికం :- ఆర్ధికంగా బాగుగా స్థిరపడతారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రిప్రజెంటివ్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆశాజనకం. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులకు హోదా పెరగటం, కోరుకున్న చోటికిబదిలీ వంటి శుభపరిణామాలుంటాయి. స్త్రీలతో మితంగా సంభాషించండి.
 
ధనస్సు :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం పడిగాపులు పడతారు. పాతమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విందులలో పరిమితి పాటించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం.
 
మకరం :- ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. బంధు మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటం ఎదురవుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూ లేఖలు అందుకుంటారు. స్త్రీలకు పని భారం అధికం. రిప్రజెంటేటివ్లకు, ప్రైవేటు సంస్థలోని వారికి మార్పులు అనకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం నిరుత్సాహపరుస్తుంది.
 
కుంభం :- ఆర్థిక లావాదేవీలు, కీలమైన వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. బంధువులను కలుసకుంటారు. రాజకీయనాయకులు పార్టీ సభ్యులతో ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన స్ఫురిస్తుంది. 
 
మీనం :- కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. వ్యవహార దక్షత, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ ఉన్నతిని చాటుకోవటం కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి వస్తుంది. మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు