04-11- 2024 సోమవారం దినఫలితాలు : సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది...

రామన్

సోమవారం, 4 నవంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులను ఆకట్టుకుంటారు. చర్చలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. పొదుపు ధనం అందుకుంటారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. విందుల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
విజ్ఞతతో వ్యవహరిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. దూరప్రయాణం తలపెడతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆచితూచి వ్యవహరించాలి. మితంగా సంభాషించండి. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. రావలసిన ధనం అందుతుంది. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. పనులతో సతమతమవుతారు. పత్రాలు అందుకుంటారు. జూదాలు, బెట్టింగ్ జోలికి పోవద్దు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
యత్నాలకు అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఖర్చులు సామాన్యం. రావలసిన ధనాన్ని సామరస్యంగా వసూలు చేసుకోవాలి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సన్నిహితుల వ్యాఖ్యలు కార్మోనుఖులను చేస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆహ్వానం అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. పనిభారం, అకాల భోజనం, విశ్రాంతిలోపం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పిల్లల దూకుడు అదుపు చేయండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు సానుకూలమవుతాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కొత్త పరిచయాలు బలపడతాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సన్నిహితుల సలహా పాటించండి. అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. అందరితోను సౌమ్యంగా మెలగండి. ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టాన సాగవు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. కొంతమొత్తం ధనం అందుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల కలయిక వీలుపడదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ వాక్కు ఫలిస్తుంది. పరిచయాలు, సంబంధాలు బలపడతాయి, మాట నిలబెట్టుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. కీలక పత్రాలు అందుతాయి, అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు