పరిస్థితులు అనుకూలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పనులు మందకొడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. రావలసిన ధనం అందుతుంది. ఒక పట్టాన సాగవు. సన్నిహితులతో సంభాషిస్తారు. అనవసర జోక్యం తగదు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు.
ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు విపరీతం. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. కొత్త పనులు మొదలెడతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు మరింత శ్రమించాలి. పట్టింపులకు పోవద్దు. లౌక్యంగా మెలగండి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కృషి ఫలించకున్నా శ్రమించామన్న తృప్తి ఉంటుంది. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. బెట్టింగుల జోలికి పోవద్దు.
ప్రణాళికాబద్ధంగా మీ ప్రయత్నాలు సాగిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమర్థతను చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. అందరితోనూ మితంగా సంభాషించండి.
ధృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయాలు బలపడతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. కీలక పత్రాలు జాగ్రత్త. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
స్వయంకృషితో కార్యం సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. సన్నిహితులకు సాయం అందిస్తారు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడపుతారు. పనులు పురమాయించవద్దు. కీలక సమావేశంలో పాల్గొంటారు.
ఒత్తిడి, ఆందోళనలకు గురికావద్దు. సర్వత్రా అనుకూలంగానే ఉంటుంది. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఖర్చులు సామాన్యం. పనులు హడావుడిగా సాగుతాయి. వేడుకల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. వాహనం ఇతరులకివ్వవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారానుకూలత ఉంది. మంచి నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు ఖర్చుచేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధువులు ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు.