08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

రామన్

మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీలు ఫలిస్తాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి ఫోన్ సందేశాలను నమ్మవద్దు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఉల్లాసంగా గడుపుతారు. సంతానం చదువులపై దృష్టిపెడతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మొండిధైర్యంతో అడుగులేస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యంకాదు. ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రలోభాలకు లొంగవద్దు. ఆప్తులను సంప్రదించండి పనులు హడావుడిగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకకు హాజరవుతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలతో తీరిక ఉండదు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అనాలోచిత నిర్ణయాలు తగవు. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. ఆశావహదృక్పధంతో మెలగండి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. పనులు ఒక పట్టాన సాగవు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. కొంతమొత్తం ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. కష్టమనుకున్న పనులు సానుకూలమవుతాయి ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. శుభవార్త వింటారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసిద్ధికి ఓర్పు, పట్టుదల ప్రధానం. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. ప్రణాళికాబద్ధంగా పనుల పూర్తి చేస్తారు. అందరితోను మితంగా సంభాషించండి. ఇతరుల బాధ్యతలు తీసుకోవద్దు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
రుణ విముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు సామాన్యం. పనులు చురుకుగా సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. లక్ష్యాన్ని సాధించే వరకూ శ్రమించండి. బాధ్యతలు అప్పగించి ఇబ్బంది పడతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వ్యవహారాల్లో తొందరపాటు తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. లక్ష్యం సాధించే వరకు శ్రమించండి. ఖర్చులు సామాన్యం. పనులు చురుకుగా సాగుతాయి. అసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చిన్న విషయానికే చికాకుపడతారు. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు