ప్రణాళికలు వేసుకుంటారు. పెట్టుబడులకు తరుణం కాదు. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి.
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. యత్నాలు కొనసాగించండి. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పరిచయస్తులు సాయం అర్ధిస్తారు. పనులు వాయిదా వేయవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. నగదు, కీలక పత్రాలు జాగ్రత్త.
నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. వాహన సౌఖ్యం పొందుతారు. ఖర్చులు సామాన్యం. ధనసహాయం తగదు. ఆప్తులతో సంభాషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో తీరిక ఉండదు. ఆచితూచి అడుగేయండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయానికే చికాకుపడతారు. సన్నిహితులు వాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. దైర్యంగా యత్నాలు సాగిస్తారు. పత్రాలు అందుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికంగా బాగుంటుంది. ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. కీలక సమావేశంలో పాల్గొంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
సంతోషకరమైన వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి లబ్ధి కలుగుతుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు విపరీతం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. గుట్టుగా యత్నాలు సాగించండి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. నోటీసులు అందుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. కీలక పత్రాలు అందుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పనులు చురుకుగా సాగుతాయి.
మీ శ్రీమతి వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. నగదు, పత్రాలు జాగ్రత్త. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది.
ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. వ్యవహారానుకూలత ఉంది. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు విపరీతం. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. నగదు, నగలు జాగ్రత్త.
మనోధైర్యంతో మెలగండి. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. అపజయాలకు కుంగిపోవద్దు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు పురమాయించవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.