16-01-2024 మంగళవారం దినఫలాలు - ఇష్టదైవాన్ని ఆరాధించినా మీ సంకల్పం సిద్ధిస్తుంది...

రామన్

మంగళవారం, 16 జనవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య శు॥ పంచమి ఉ.7.31 షష్టి తె.5.18 పూర్వాభాద్ర ప.11.29
రా.వ.8.28 ల 9.57. ఉ.దు. 8.46 ల 9.30 రా.దు. 10.45 ల 11.37.
ఇష్టదైవాన్ని ఆరాధించినా మీ సంకల్పం సిద్ధిస్తుంది.
 
మేషం :- ప్రియతముల కోసం, సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయకసత్కాలంను సద్వినియోగం చేసుకోండి. స్త్రీలు టి.వి. ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ముఖ్యమైన వ్యక్తుల కలయిక వల్ల మేలు జరుగుతుంది. సంఘంలో మీకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది.
 
వృషభం :- ఓరిమితో ప్రయత్నిస్తే సులభంగా లక్ష్యాలు సాధిస్తారు. లాయర్లకు నిరుత్సాహం కానవస్తుంది. అతిథి మర్యాదలు బాగా నిర్వహిస్తారు. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన కాలం. మీ సంతానం మొండి వైఖరివల్ల చికాకులు తప్పవు.
 
మిథునం :- మీపై అధికారుల ధోరణిలో మార్పు కనిపిస్తుంది. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. మీ అభిలాష నెరవేరే సమయం ఆసన్నమవుతోందని గమనించండి. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఆత్మీయల కోసం ధనం విరివిగా వ్యయంచేస్తారు. శతృవులపై విజయం సాధిస్తారు.
 
కర్కాటకం :- హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. ఇతరులు మిమ్మల్ని చూసిఅపోహపడే ఆస్కారముంది. రుణ విముక్తులు కావడంతోపాటు రుణాలు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొన్ని బంధాలను నిలుపుకోవటానికి కష్టపడాల్సి వస్తుంది. పరస్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించండి.
 
సింహం :- తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. పాతబాకీలు వసూలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంది తొలగుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి.
 
కన్య :- పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు కలిసివచ్చేకాలం. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం ఆశించినంతగా ఉండదు. మీ ప్రియతముల కోసం పిల్లల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. గృహోపకరణాలు కొనుగోలుచేస్తారు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అసవరం.
 
తుల :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ సంతానం మొండివైఖరిమీకు చికాకు కలిగిస్తుంది. బంధు జీమిత్రుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు కూరగాయల వ్యాపారులు పురోభివృద్ధి పొందుతారు. ఇతరుల సహాయం అర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు.
 
వృశ్చికం :- హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. దైవ కార్యాల పట్లశ్రద్ధ వహిస్తారు. నూతన వాతావరణం, కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.
 
ధనస్సు :- స్త్రీలు అతిథి మర్యాధలు బాగుగా నిర్వహిస్తారు. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ధనం ఎంత వ్యయం చేసినా ఫలితం ఉండదు. విద్యార్థులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో సఫలీకృతులవుతారు.
 
మకరం :- మీ అభిప్రాయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, చిరువ్యాపారాలకు పురోభివృద్ధి కానవస్తుంది. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం.
 
కుంభం :- దైవ, పుణ్యకార్యాలకు ఇతోధికంగా సహకరించటం వల్ల మీ గౌరవ, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ తొందరపాటు నిర్ణయాన్ని బంధుమిత్రులు వ్యతిరేకిస్తారు. పత్రికా రంగంలోని వారికి నిరుత్సాహం తప్పదు. రావలసిన మొండి బాకీలు ఆలస్యమైనకానీ వసూలవుతాయి. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అసవరం.
 
మీనం :- స్త్రీలు వేడుకలు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ధాన్యం, కలప, పేపరు, యాంత్రిక వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సన్నిహితుల మధ్య రహస్యాలుదాచడం వల్ల విభేదాలు తలెత్తవచ్చు. నిరుద్యోగలు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు