శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య శు॥ పాడ్యమి సా.4.30. ఉత్తరాషాఢ సా.5.44 రా.వ.9.30 ల 11.01. ఉ.దు. 8.47 ల 9.31 ప.దు. 12.27 ల 1.11.
లక్ష్మీదేవికి పూజ చేయడంవల్ల అన్నివిధాలా శుభం కలుగుతుంది.
మేషం :- వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. రావలసిన ధనం సమయానికి అందటంతో కుదుటపడతారు. దైవదర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సినిమా, కళా, రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. కోర్టు, ఆస్తి, స్థల వివాదాలు నిరుత్సాహ పరుస్తాయి.
వృషభం :- ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. ఇతరుల స్థితిగతులతో పోల్చుకోవద్దు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు లేకున్నా నష్టాలను అధిగమిస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
మిథునం :- వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించాలి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా వ్యయాలు రూపొందించుకుంటారు. ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణంలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం.
కర్కాటకం :- మీ శ్రీమతితో కొత్త విషయాలు ప్రస్తావిస్తారు. మీ సంతానం మొండితనం ఇబ్బందులకు దారితీస్తుంది. బ్యాంకు పనులు వాయిదా పడుట వల్ల నిరుత్సాహం చెందుతారు. అదనపు రాబడిపై దృష్టి సారిస్తారు. ప్రతి విషయంలోను కొత్త ఉత్సాహంతో శ్రమిస్తారు. సంప్రదింపులు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.
సింహం :- వివాదాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. ప్రియతముల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. పెద్దమొత్తం ధనసహాయం క్షేమం కాదు. మీ సంతానం భవిష్యత్తు కోసం చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. వాహనం నిదానంగా నడపడం శ్రేయస్కరం.
కన్య :- దైవ, సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే సూచనలున్నాయి. మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. వ్యవహారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. ప్రయాణాల్లో చికాకులు తప్పవు.
తుల :- ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. కుటుంబ విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. ఒక స్థిరాస్తి కొనుగోలుకు అడ్డంకులు తొలగిపోగలవు. ఆలయాలను సందర్శిస్తారు. మీయత్నాలు గుంభనంగా సాగించాలి. మీ సంతనం భవిష్యత్తు కోసం పొదుపు పథకాలు చేపడతారు.
వృశ్చికం :- కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. హామీలు, ఒప్పందాల్లో మీ శ్రీమతి అభిప్రాయం తెలుసుకోవటం ఉత్తమం. ఓర్పుతో సర్దుకుపోవటానికి యత్నించండి. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలుంటాయి. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది.
ధనస్సు :- వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. కొత్తగా వచ్చిన అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇష్టంలేకున్నా కొన్ని విషయాల్లో సర్దుకుపోవలసి ఉంటుంది. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. పత్రికా సిబ్బందికి ఒత్తిడి, పనిభారం అధికం. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు సంభవం. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి.
మకరం :- వృత్తిపరంగా చిన్న చిన్న చికాకులు ఎదుర్కుంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. భాగస్వామిక సమావేశాలు వాయిదా పడతాయి. కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలిస్తాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు.
కుంభం :- ఆర్థిక లావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. సంఘంలో మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోవాలి. అగ్రిమెంట్లు, బయానా చెల్లింపుల్లో మెళకువ వహించండడి. కిట్టని వారు మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు.
మీనం :- ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. ఆలయాలను సందర్శిస్తారు. ఆస్తి, స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి.