23-08-2023 బుధవారం రాశిఫలాలు - వరసిద్ధి వినాయకుడిని గరికెతో ఆరాధించిన శుభం

బుధవారం, 23 ఆగస్టు 2023 (04:00 IST)
మేషం :- స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ప్రముఖుల సలహా పాటించటం మంచిది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. సోదరీ, సోదరుల మధ్య విబేధాలు తలెత్తుతాయి. కొత్త వ్యాపారాభివృద్ధికి శ్రమించాలి. స్వయం కృషితో రాణిస్తారు. విద్యార్థులకు కోరుకున్న టెక్నికల్, మెడికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది.
 
వృషభం :- ఆర్థికపరమైన విషయాలతో పాటు పనిలో కూడా రాజీ పడవలసి వస్తుంది. ప్రముఖులను కలుసుకుంటుంది. విద్యార్థులకు, విద్యా రంగాల వారికి మెళకువ అవసరం. వెండి, బంగారు, తాకట్టు వ్యాపారులకు శుభదాయకంగా ఉంటుంది. క్రీడా రంగాలవారికి చికాకులు తప్పవు. అవివాహితులకు అనుకూలమైన కాలం.
 
మిథునం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో శ్రద్ధవహించండి. వాహనం విషయంలో సంతృప్తికానవస్తుంది. క్రయ విక్రయ రంగాలలోని వారికి ప్రోత్సాహం కానవస్తుంది. కళాకారులకు, రచయితలకు పత్రికా రంగంలో వారికి మిశ్రమ ఫలితం. దూర ప్రయాణాలు అనుకూలం. కాంట్రాక్టర్లలకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.
 
కర్కాటకం :- మీ కళత్ర వైఖరి మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. పండ్లు, పూల, కూరగాయ వ్యాపారులకు కలిసివస్తుంది. 
 
సింహం :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. సైన్సు, గణిత రంగాలలోనివారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. కోర్టు వ్యవహరాలు ప్రగతి పథంలో నడుస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. బంధువులను కలుసుకుంటారు.
 
కన్య :- స్త్రీలకు వస్త్ర, వస్తులాభం వంటి శుభపరిణామాలు ఉంటాయి. బంధు మిత్రులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. బ్యాంకు వ్యావహారాలలో ఆచి తూచి వ్యవహరించండి. గృహంలో మార్పులు, చేర్పులకు కొంతకాలం వేచియుండటం మంచిది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
తుల :- రావలసిన ధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచన లుంటాయి. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- కాంట్రాక్టర్లకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. నూతన దంపతుల మధ్య సంతాన యోగం. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. చేతి వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికమవుతాయి. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తాయి. నిరుద్యోగులకు ఉపాధిపథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
ధనస్సు :- ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. ఓర్పుగా ఎలా ఉండాలో నేర్చుకోవడం ఎంతైనా అవసరం. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రముఖులను కలుసుకుంటారు.
 
మకరం :- ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. బిల్లులు చెల్లిస్తారు. రాజకీయ కళా రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. గృహోపకరణాలు అమర్చుకుంటారు. వ్యాపారాలలో పోటీ పెరగడం వల్ల అధికంగా శ్రమించవలసి ఉంటుంది.
 
కుంభం :- కుటుంబ విషయాలు పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక స్థిరాస్తిని అమర్చుకోవలనే ఆలోచన స్ఫురిస్తుంది. మిత్రుల సహాయంతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు.
 
మీనం :- ప్రయాణాలలోను, బ్యాంకు వ్యవహారాలలోను మెళకువ అవసరం. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు ఊహించనివి కావటంతో రుణయత్నాలు తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారి సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు