ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. ఖర్చులు సామాన్యం. గృహమార్పు అనివార్యం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
లావాదేవీలు కొలిక్కివస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతమవుతాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఆప్తుల కలయిక వీలుపడదు. పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. ఖర్చులు విపరీతం. రుణ సమస్యలు వేధిస్తాయి. నిస్తేజానికి లోనవుతారు. పనులు సాగవు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆత్మస్థైర్యంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. కష్టసమయాల్లోనే మీ విజ్ఞతను చాటుకుంటారు. మీ కృషి, పట్టుదల స్ఫూర్తిదాయకమవుతాయి. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి.
అన్నివిధాలా కలిసివచ్చే సమయం. లక్ష్యానికి చేరువవుతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పొదుపునకు అవకాశం లేదు. పనులు హడావుడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహమరమ్మతులు చేపడతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త.
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు అధికం. సన్నిహితులకు సాయం చేస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. వాదనలకు దిగవద్దు. పనులు సానుకూలమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. సోదరులతో సంభాషిస్తారు. ఆత్మీయుల కలయిక సంతోషాన్నిస్తుంది.
సంప్రదింపులతో తీరిక ఉండదు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి.
రుణ సమస్య తొలగుతుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. వేడుకకు హాజరవుతారు. ఖర్చులు భారమనిపించవు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.
ఆచితూచి అడుగేయండి. కొంతమంది మీ మాటతీరును తప్పుపడతారు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద తీరుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. చేపట్టిన పనులు సాగవు. పత్రాలు, నగదు జాగ్రత్త. వాహనదారులకు కొత్త సమస్యలెదురవుతాయి.