శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ ఐ|| చవితి ఉ.8.24 పూర్వాభాద్ర రా.8.45 ఉ.శే.వ.5.47కు ఉ.దు. 9.53 ల 10.45 ప.దు. 3. 06 ల 3.58.
మేషం :- ఉద్యోగులకు సంబంధించిన సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. దూరంలో ఉన్న ప్రియతముల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ సంతానం వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు ఆందోళన అధికమవుతుంది. బ్యాంకింగ్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
వృషభం :- కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేక పోతారు. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకం. వాహన సౌఖ్యం, పదోన్నతి వంటి శుభపరిణామాలుంటాయి.
మిథునం :- ప్రైవేటు సంస్థలలోవారికి ఆత్మనిగ్రహం చాలా అవసరమని గమనించండి. ఉమ్మడి వ్యాపారాలు ఆశించింనంత సంతృప్తికరంగా ఉండవు. స్త్రీలకు విదేశీ వస్తువులు, అలంకరణలపై ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు షాపింగ్, ప్రయాణాలలో విషయాలలో మెళుకువ అవసరం. నూతన పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి.
కర్కాటకం :- స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది గృహోపకరణాలకు కావసిన విలువైన వస్తువులు సేకరిస్తారు. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
సింహం :- ఆలయాలను సందర్శిస్తారు. ప్రియతముల పట్ల, ముఖ్యలపట్ల శ్రద్ధ పెరుగుతుంది. కీలకమైన పత్రాల విషయంలో జాగ్రత్త పాటించాలి. సన్నిహితుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలలో మెళుకువ అవసరం. కాంట్రాక్టర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు.
కన్య :- శత్రువులు మిత్రులుగా మారుతారు. వాగ్వివాదాలకు దిగి సమస్యలు కొని తెచ్చుకోకండి. రావలసిన బకాయిలు వసూలు విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ప్రయాణాల్లో కొంత అసౌకర్యం తప్పకపోవచ్చు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయుయత్నాలలో జయం పొందుతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులుతప్పవు.
తుల :- ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. ఫైనాన్స్, చిట్స్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఋణం ఏ కొంతైనా తీర్చటానికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. కొందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పటతప్పదు.
వృశ్చికం :- మీ పై అధికారుల ధోరణిలో మార్పు కనిపిస్తుంది. కీలక నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవాంతరాలు ఎదురైనా మొండి ధైర్యంతో శ్రమించి పూర్తి చేస్తారు.
ధనస్సు :- ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. మీ నిర్లక్ష్యం వల్ల గృహములో విలువైన వస్తువులు చేజారిపోతాయి. జాగ్రత్త వహించండి. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ, చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి.
మకరం :- స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. ప్రతి విషయంలోను స్వయంశక్తినే నమ్ముకోవటం ఉత్తమం. చిన్నారులు, విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలో ఖర్చులు అంచనాలు మించుతాయి. విదేశీయానం నిమిత్తం చేస్తున్న యత్నాలలో ఆటంకాలు తొలగిపోతాయి.
కుంభం :- కుటుంబీకులతో కలిసి దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులపై ఉంచిన నమ్మకం సన్నగిల్లుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులుపడతారు. విద్యార్థులకు గత అనుభవాలు జ్ఞప్తికివస్తాయి. ఆరోగ్యం, వృత్తి వ్యాపారాలపై దృష్టిపెడతారు. సమయానికి కావలసిన వస్తువులు కనిపించక విసుగు చెందుతారు.
మీనం :- స్త్రీలకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. మీకు ఎదురయ్యే సమస్యలకు మీ స్నేహితులతో చర్చించి వారి సలహా తీసుకోవడం మంచిది. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది.