23-05-2025 శుక్రవారం దినఫలితాలు - అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు...

రామన్

శుక్రవారం, 23 మే 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
శ్రమతో కూడిన ఫలితం ఉంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. స్థిమితంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వాహనం, ఆభరణాలు జాగ్రత్త. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొందరిరాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గత అనుభవంతో జాగ్రత్త వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కొత్తపనులు చేపడతారు. సంస్థల స్థాపనలకు లైసెన్సులు మంజూరవుతతయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహిండి. ఒత్తిళ్లకు గురికావద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ధృఢసంకల్పంతో ముందుకు సాగుతారు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోతాయి. పనులు పురమాయించవద్దు. కొత్త వ్యక్తులను ఓ కంట కనిపెట్టండి. ఇతరుల ప్రస్తావన తేవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. ఓర్పుతో యత్నాలు సాగించండి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. దూరపు బంధువులతో సంభాషిస్తారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శ్రమతో కూడిన విజయాలున్నాయి. పట్టుదలతో శ్రమించండి. అవకాశాలను వదులుకోవద్దు. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణం చికాకుపరుస్తుంది.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యవహారజయం ఉంది. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. అనవసర జోక్యం తగదు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివేసి వెళ్లకండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చర్చలు సఫలమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. సన్నిహితులతో సంభాషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. బెట్టింగులకు పాల్పడవద్దు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు