11-04-22 సోమవారం రాశిఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన సంకల్పసిద్ధి

సోమవారం, 11 ఏప్రియల్ 2022 (04:00 IST)
మేషం :- వ్యాపార లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. ప్రతి పనిని మీ సొంత తెలివితేటలతో ఆలోచించడం వలన అనుకూలంగానే పూర్తవుతాయి. టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగములో ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయమని గమనించండి.
 
వృషభం :- వృత్తి వ్యాపారాలకు సంబంధించిన కీలకమైన సమాచారం అందుకుంటారు. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయటం వలన ఆశాంతికి లోనవుతారు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
మిథునం :- స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. వ్యవసాయ, ఎగుమతి, దిగుమలు లాభిస్తాయి. మొక్కుబడులు చెల్లిస్తారు. రాజకీయ రంగాల వారికి ప్రయాణాలు వాయిదా పడుట మంచిది. తరచూ వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఏదైనా విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక ఫలిస్తుంది.
 
కర్కాటకం :- కొబ్బరి, పండ్ల, పూల, చల్లనిపానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఉద్యోగుల కృషి ఫలిస్తుంది. దైవ దర్శనం చేస్తారు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. దూరదేశాలు వెళ్ళడానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
సింహం :- ఉద్యోగస్తులు పై అధికారులను మెప్పిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. ప్రముఖుల సహాయంతో ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. వాహనం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కన్య :- ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. స్త్రీలు గృహాలంకరణ, విలాస వస్తువుల పట్ల కనబరుస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఆకస్మిక ప్రయాణం తల పెడతారు. వ్యతిరేకులు సన్నిహితులుగా మారతారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
తుల :- వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి చూపుతారు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచివి కాదని గమనించండి.
 
వృశ్చికం :- ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. చెల్లింపులు, చెక్కుల జారీలో జాగ్రత్త అవసరం. బంధువులతో మనస్పర్థలు తలెత్తుతాయి. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. చేతివృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. పాత బాకీలు అనుకోకుండా వసూలవుతాయి.
 
ధనస్సు :- ఆర్థిక వ్యవహారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగును. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన అవసరం. మిమ్మల్ని తక్కువ అంచనా వేసే వారు మీ సహాయం ఆర్థిస్తారు.
 
మకరం :- అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. కొంతమంది మీ నుంచి సమాచారం సేకరించేందుకు యత్నిస్తారు. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. తలపెట్టిన పనులు సాగక విసుగు చెందుతారు.
 
కుంభం :- నృత్తి వ్యక్తిగత నిర్ణయాల పట్ల సమన్వయం పాటించండి. ఎదురు చూడకుండానే మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో రాణిస్తారు. ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. పత్రిక, ప్రైవేటు సంస్థలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
మీనం :- వృత్తులలో వారికి చికాకులు, నిరుత్సాహం వంటివి తలెత్తుతాయి. పెద్దలను, ప్రముఖులను కలుసుకోగలుగుతారు. బంధువులతో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ యత్నాలు కొంత ఆలస్యంగానైనా పరిపూర్ణంగా పూర్తవుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు