27-09-2021 సోమవారం రాశిఫలాలు - మల్లికార్జున స్వామిని...

సోమవారం, 27 సెప్టెంబరు 2021 (04:00 IST)
మేషం:- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. భాగస్వామ్యుల మధ్య అవగాహన కుదరదని చెప్పవచ్చు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇతరులపై మీరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. బంధుమిత్రుల రాకతో ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి.
 
వృషభం:- ఓర్పు, నేర్పుతో వ్యవహారించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి. ఇతరుల సహాయం అర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి.
 
మిథునం:- బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. ముఖ్యమైన విషయాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత చాలా అవసరం. ప్రతి విషయాన్ని మీ జీవిత భాగస్వామికి తెలియజేయండి. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాల దిశగా ఆలోచనలు సాగిస్తారు. 
 
కర్కాటకం:- ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి అధికమవుతుంది. విదేశాలు వెళ్ళటానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన విషయాల్లో మీ శ్రీమతి సలహా పాటించటం మంచిది.
 
సింహం:- ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి పై అధికారులను మెప్పిస్తారు. దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. బంధుమిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు.
 
కన్య:- నరాలు, కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్ ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి ఆశాజనంగా ఉంటుంది. భార్యా, భర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. ప్రతి విషయంలోనూ ఓర్పు, సంయమనంతో వ్యవహరించవలసి ఉంటుంది.
 
తుల:- రావలసిన బకాయిలు సకాలంలో అందుతాయి. భాగస్వామికుల మధ్య ఆసక్తికరమైన విషయాలకు చర్చకు వస్తాయి. మీ సంతానం మొండివైఖరి కారణంగా చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. జాబ్ వర్కు చేయువారికి ఆందోళనకు గురౌతారు. క్రీడా రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరీ సోదరుల మధ్య ఏకీభవం కుదరదు.
 
వృశ్చికం:- ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. కాంట్రాక్టర్లకు ఆందోళన పెరుగుతుంది. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు, ఆస్తి పంపకాలకు సంబంధించిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. నిత్యావసర వస్తువులు, బియ్యం, ఉల్లి వ్యాపారులకు వేధింపులు, చికాకులు అధికమవుతాయి.
 
ధనస్సు:- టి.వి., రేడియో రంగాలలో వారికి నిరుత్సాహం కానవస్తుంది. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. మీ ఆశయసిద్ధికి నిరంతర కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఊహించని ఖర్చులు అధికం అగుటవలన ఆందోళన చెందుతారు.
 
మకరం:- ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. స్త్రీలు పనివారలతో చికాకులను ఎదుర్కుంటారు. వాహనం నపుడునపుడు మెళుకువ అవసరం. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. తలపెట్టిన పనులు విసుగు కలిగిస్తాయి.
 
కుంభం:- ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. సోదరులతో ఏకీభవించలేకపోతారు. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. ఒక విషయంలో మిత్రులపై ఉంచిన మీ నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం ఉంది. మత్స్య కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు సమస్యలు తప్పవు. 
 
మీనం:- ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయే అవకాసం ఉంది. ఇతరుల కోసం ధనం విరివిగావ్యయం చేస్తారు. మీ చేపట్టిన పనికి ఇతరుల నుంచి అవాంతరాలు ఎదుర్కుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల పరిచయాలు మీ ఉన్నతికి నాంది పలుకుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు