01-09-2022 నుంచి 30-09-2022 వరకు మీ మాస రాశిఫలాలు

మంగళవారం, 30 ఆగస్టు 2022 (22:27 IST)
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని సమస్యలు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం. దంపతుల మధ్య సఖ్యత, ప్రశాంతత పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఆచితూచి వ్యవహరించాలి. అనుభవజ్ఞులను సంప్రదించటం శ్రేయస్కరం. సంతానం ఉన్నత చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉపాధ్యాయులకు పురస్కారం, ఉద్యోగస్తులకు పనిభారం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. కార్మికులు, వృత్తుల వారికి కష్టకాలం. వ్యవసాయ తోటల రంగాల వారికి ఆశాజనకం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
సంప్రదింపులతో తీరిక ఉండదు. వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. గృహమార్పు కలిసివస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. సంతానం పై చదువులపై దృష్టి పెడతారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. మీ సాయంతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. అధికారులకు బాధ్యతల మార్పు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఈ మాసం అనుకూలదాయకమే. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. రుణ ఒత్తిళ్లు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం. ఆందోళన తగ్గి కుదుటపడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉపాధ్యాయులు ప్రశంసందుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
గ్రహాలు అనుకూలిస్తాయి. సంకల్పం సిద్ధిస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. గృహమార్పు అనివార్యం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. కార్మికులకు కష్టసమయం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పొదుపు ధనం గ్రహిస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. గుటుగా వ్యవహరించండి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 

కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దాంపత్యసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పనులు సానుకూలమవుతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదానలకు ఆమోదం లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉపాధ్యాయులకు శుభయోగం. ఉపాధి పథకాలు చేపడతారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తునాయి. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా మంచికేనని
భావించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చీటికి మాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా
ఉండటానికి యత్నించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కార్మికులకు పనులు లభిస్తాయి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 

ధనరాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం 
సమర్ధతను చాటుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. కొత్త పరిచయాలేర్పడతాయి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధ్యాయులకు పురస్కార యోగం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వాహనదారులకు దూకుడు తగదు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయం మెరుగుపడుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. దళారులను నమ్మవద్దు. మీ నుంచి విషయసేకరణకు కొంతమంది యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభరాశి : ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆరోగ్యం సంతృప్తికరం. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదామార్పు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రుణ సమస్యల నుంచి బయటపడతారు. పెట్టుబడులకు తరుణం కాదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యవహార జయం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. నగదు, ఆభరణాలు జగ్రత్త. పసులు, బాధ్యతలు అపుగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరీ సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు