ఉష గారూ.. మీ భర్తకు ఆగస్టుతో శనిదోషం తొలగిపోతుంది..

శుక్రవారం, 6 జులై 2012 (17:53 IST)
FILE
ఉష-బెంగళూరు:

మీ భర్త సుబ్రహ్మణ్యం ఏకాదశి శుక్రవారం తులాలగ్నము, పుబ్బ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరము ఆగస్టుతో శనిదోషం తొలగిపోతుంది. 2013 నందు ఉద్యోగంలో పురోభివృద్ధి కానవస్తుంది.

2013 లేక 2014 నందు విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. 2013 నవంబరు నుంచి రాహు మహర్ధశ 18 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధినిస్తుంది.

చర్మ, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. కనకదుర్గా అమ్మవారికి కుంకుమ పూజ చేయించినా సర్వదా శుభం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి