ఎల్. వెంటనారశివప్రసాద్ గారూ.. వరసిద్ధి వినాయకుడిని పూజించండి

మంగళవారం, 3 జులై 2012 (16:59 IST)
FILE
ఎల్. వెంటనారశివప్రసాద్-కాకినాడ

మీరు సప్తమి శనివారం తులాలగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ఒత్తిడి, చికాకు, ఆందోళనలు ఎదుర్కొన్నా నెమ్మదిగా సమసిపోయి పురోభివృద్ధి పొందుతారు. ధన భార్యస్థానాధిపతి అయిన కుజుడు భాగ్యము నందు ఉండటం వల్ల వివాహానంతరం మీరు బాగుగా రాణిస్తారు.

మీ 31 లేక 32 సంవత్సరము నందు వివాహం అవుతుంది. వరసిద్ధివినాయకుడిని పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. 2002 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2014 నుంచి 2019 వరకు మంచి యోగాన్ని ఇవ్వగలడు.

తదుపరి కేతు మహర్ధశ ఏడు సంవత్సరాలు, శుక్ర మహర్ధశ 20 సంవత్సరాలు సత్కాలం అని చెప్పవచ్చు. వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. మీకు శుభం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి