మోహన్- కాకినాడ: మీరు అష్టమి మంగళవారం మేషలగ్నము ఉత్తరాభాద్ర నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరము వరకు చంద్రాత్తు లాభస్థానము నందు రాహు సంచారం వల్ల మంచి మంచి అవకాశాలు చేజార్చుకున్నారు. 2013 వరకు కేతు మహర్ధశ ఉన్నందువల్ల ఏ పని తలపెట్టినా అధిక ప్రయత్నానంతరం సత్ఫలితాలను పొందుతారు. 2013 నుంచి శుక్రమహర్ధశ 20 సంవత్సరాలు గణనీయమైన అభివృద్ధినిస్తుంది.