నరసింహారావు గారూ.. ఈ శ్లోకాన్ని 18 సార్లు పఠించండి.
గురువారం, 12 జులై 2012 (17:40 IST)
FILE
నరసింహారావు-హైదరాబాద్:
మీ కుమార్తె త్రయోదశి సోమవారం కుంభలగ్నము, అనురాధ నక్షత్రం, వృశ్చికరాశి నందు జన్మించారు. భర్తస్థానాధిపతి అయిన రవి, బుధ, శనులతో కలయిక వల్ల వివాహ విషయంలో సమస్యలు తలెత్తుతాయి. 2013 మే నుంచి డిసెంబర్ లోపు పునర్వివాహం అయ్యే అవకాశం ఉంది. తూర్పు నుంచి లేక పడమర నుంచి సంబంధం స్థిరపడుతుంది.
2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 19సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా దోషాలు తొలగిపోతాయి. ఈ క్రింది శ్లోకాన్ని ప్రతీరోజూ 18సార్లు పఠించినా సర్వదాశుభం కలుగుతుంది.