మీరు ఏకాదశి శనివారం తులా లగ్నము, ఉత్తర నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం, 17సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి శనిని పూజించినా మీరు సర్వదోషాలు తొలగిపోతాయి. అలాగే సాయిబాబా ఉండే దునిలో నెలకు ఒక శనివారం నాడు తెల్లజిల్లేడు సమిధలను వేయండి. మీకు శుభం కలుగుతుంది. వర్తమానం 2005 నుంచి రాహు మహర్ధశ ప్రారంభమైంది. ఈ రాహువు 2013 నుంచి 2023 వరకు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది. ప్రతీరోజు ఇష్టకామేశ్వరి దేవిని పూజించడం వల్ల శుభం కలుగుతుంది.
మీ భర్త రాజేష్ త్రయోదశి శనివారం వృశ్చికలగ్నము, మృగశిర నక్షత్రం వృషభరాశి లగ్నమునందు బుధ, శని, కేతువులు ఉండటం వల్ల తక్షక కాలసర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించండి. శుభం కలుగుతుంది. నెలకు ఒక మంగళవారం నాడు నాగేంద్రునికి పచ్చిపాలతో 41 మంగళవారాలు అభిషేకం చేయించండి. శుభం కలుగుతుంది. 2009 నుంచి గురు మహర్ధశ ప్రారంభమైంది. ఈ గురువు 2010 అక్టోబర్ నుంచి 2025 వరకు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది.