మేము అమెరికాలో ఉన్నాం.. మావారికి మంచి ఉద్యోగం దొరుకుతుందా...
మంజుల- కర్నూల్:
మీరు విదియ సోమవారం, మిథునలగ్నము, మూలా నక్షత్రం ధనుర్‌రాశి నందు జన్మించారు. అష్టమాధిపతి అయిన శని లాభము నందు నీచి పొంది ఉండటం వల్ల, తాత్కాలికంగా ఉద్యోగం చేసినా 2012 అక్టోబరు తదుపరి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. 2011 ఫిబ్రవరి నుంచి కుజ మహర్థశ ప్రారంభమయింది. ఈ కుజుడు 2013 నుంచి 2018 వరకు మంచి యోగాన్ని ఇచ్చి మంచి మంచి అవకాశాలను ఇస్తాడు. సుబ్రమణ్యస్వామిని పూజించడం వల్ల కుటుంబ సౌఖ్యం చేకూరి శుభం అభివృ్ద్ధి పొందుతారు.
మీ భర్త కె. శ్రీనివాసరావు పూర్ణమా శుక్రవారం సింహలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. సప్తమస్థానము నందు గురు, చంద్రులు ఉండటం వల్ల, కష్టించి పని చేసి బాగా అభివృద్ధి చెందుతారు. ఆరోగ్యములో మెళకువ అవసరం. బి.పి., చక్కెరవ్యాధి వంటి చికాకులు అధికమవుతాయి.
ప్రతిరోజూ శ్రీమన్నారాయణుడిని పూజించడం వల్ల శుభం కలుగుతుంది. 2008 నుంచి కేతు మహార్థశ ప్రారంభమయింది. ఈ కేతువు 2012 నవంబరు నుంచి 2015 వరకు మంచి యోగాన్ని ఇస్తాడు. ఇందు మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. బాగా స్థిరపడతారు. 2015 ఉంచి శుక్ర మహర్థశ 20 సం||ముల మహాయోగాన్ని ఇస్తుంది. నవనీత గణపతిని పూజించడం వల్ల ఆరోగ్యాభివృద్ధి అభివృద్ధి చేకూరుతుంది.