మీరు చవితి బుధవారం, కర్కాటకలగ్నము, ఉత్తరా నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరము ఆగస్టుతో ఏలినాటి శనిదోషం తొలగిపోతుంది. 2013 నుంచి సత్కాలం ప్రారంభమవుతుంది. భార్యస్థానము నందు రవి, బుధ, శుక్రులు ఉండటం వల్ల హస్తగతం అయిపోవడం వల్ల, వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరమని గమనించండి.
రాజ్యస్థానము నందు రాహువు ఉండటం వల్ల కష్టించి పనిచేసి అభివృద్ధి పొందుతారు. అందరికీ సహాయం చేసి మాటపడతారు. 2008 నుంచి రాహు మహర్ధశ ప్రారంభమైంది. ఈ రాహువు 2013 జూలై నుంచి 2026 వరకు మంచి యోగాన్ని ఇస్తుంది. అమ్మవారిని ఆరాధించండి. ఆటంకాలు తొలగిపోతాయి.