మీరు పూర్ణిమ ఆదివారం, తులాలగ్నము, ఉత్తరానక్షత్రం, కన్యారాశి నందు జన్మించారు. లగ్నము నందు శని ఉచ్చి చెంది ఉండటం వల్ల మీ జీవితానికి సంబంధించిన మంచి మంచి పథకాలు వేసి జయం పొందండి.
2014 చివరి వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించినట్లైతే సర్వదా శుభం కలుగుతుంది. దేవాలయంలో కానీ, ఖాలీ ప్రదేశాల్లో కానీ జువ్వి చెట్టును పాతండి. 2006 నుంచి శని మహర్ధశ ప్రారంభమైంది. ఈ శని మీకు 2013 నుంచి 2025 వరకు ఆర్థికాభివృద్ధిని పురోభివృద్ధినిస్తాడు. త్రినేత్రుడిని పూజించడం వల్ల మీకు కలిసివస్తుంది.