ఆనంద్-నల్గొండ: మీరు షష్టి శనివారం, వృశ్చిక లగ్నము, పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి నందు జన్మించారు. కళత్ర స్థానము నందు శుక్రుడు ఉండటం వల్ల గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య బంధించబడటం వల్ల, గ్రహ బంధన దోషం ఏర్పడటం వల్ల విషధార కాలసర్పదోష శాంతి చేయించండి. 2016 నందు వివాహమయ్యే అవకాశం 40 శాతం యోగం ఉన్నందువల్ల ప్రయత్నం చేసి సఫలీకృతులుకండి. 2012 నుంచి శుక్ర మహర్దశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 2017 నుంచి 2032 వరకూ యోగాన్ని ఇవ్వగలదు. శివపార్వతుల కళ్యాణం చేయించినా మీకు ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి.