కిషోర్ కుమార్ గారూ.. లక్ష్మీనరసింహ స్వామిని పూజించండి
మంగళవారం, 17 జులై 2012 (17:58 IST)
FILE
కిషోర్ కుమార్-కాకినాడ:
మీరు ద్వాదశి శుక్రవారం మిథునలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరము ఆగస్టుతో అష్టమ శనిదోషం తొలగిపోతుంది. భార్య స్థానాధిపతి, రాజ్యాధిపతి అనగా ఉద్యోగస్థానాధిపతి అయిన బృహస్పతి భార్యస్థానము నందు ఉండటం వల్ల వివాహం కాకుండా అభివృద్ధి ఉండజాలదు.
మీ 29 లేక 30 సంవత్సరము నందు వివాహం అవుతుంది. యోగ్యురాలైన భార్య లభించగలదు. 2008 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఊ బుధుడు 2014 నుంచి 2025 వరకు మంచి యోగాన్ని అభివృద్ధిని ప్రసాదిస్తాడు. మీరు ఈ సమయంలో ఉన్నత స్థితిలో స్థిరపడతారు. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధించినా సర్వదోషాలు తొలగి శుభం కలుగుతుంది.