దయాకర్ గారూ.. శనికి తైలాభిషేకం చేయించండి.

బుధవారం, 27 జూన్ 2012 (17:41 IST)
FILE
సి.దయాకర్ కరీమ్‌నగర్

మీరు చతుర్దశి బుధవారం, కన్యాలగ్నము, హస్తనక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ మూడు నెలలకు ఒక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించినా కలిసివస్తుంది.

లగ్నము నందు కుజ, చంద్ర, కేతువులు ఉండటం వల్ల, భార్యస్థానము నందు రాహువు ఉండటం వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరమని గమనించండి. మీ 27 లేక 28వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. 2003 నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది.

ఈ రాహువు 2013 నవంబరు నుంచి 2021 వరకు యోగాన్ని ఇస్తుంది. తదుపరి గురు మహర్ధశ 16 సంవత్సరాలు మంచి యోగాన్ని అనుభవిస్తారు. ప్రతీ రోజు ఈశ్వర ఆరాధన వల్ల సర్వదా శుభం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి