నా జాతకం గురించి చెప్పగలరు...

ఎ.మురళికృష్ణ-విశాఖపట్నం:

మీరు ఏకాదశి శనివారం, ధనుర్‌లగ్నము, ఆశ్రేష నక్షత్రం కర్కాటకరాశి నందు జన్మించారు. అష్టమ స్థానము నందు చంద్ర రాహువులు ఉండటం వల్ల, గ్రహాలన్నీరాహు, కేతువుల మధ్య బంధించబడటం వల్ల, కర్కోటకకాలసర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించండి.

2014 చివరి వరకు అర్ధాష్టమి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా శుభం కలుగుతుంది. అప్పుడప్పుడు వ్యాపారాలు చేయాలి అనే ఆలోచనల తలెత్తుతుంది.

వ్యాపారాలలో సమస్యలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. 2014 నుంచి రవి మహర్థశ 6 సం||ములు, చంద్ర మహర్థశ 10 సం||ములు, కుజ మహర్థశ 7 సం||ములు మంచి యోగాన్ని ఇస్తుంది. గజలక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఆర్ధికాభివృద్ధి పొందుతారు.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి