శ్రీలక్ష్మి - మీరు సప్తమి సోమవారం, మిథునలగ్నము, రేవతి నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. సంతానస్థానము నందు ఇంద్రుడు ఉండటం వల్ల ఒక్కోసారి మీ కుమారుని వైఖరి మీకు చికాకు కలిగించినా చదువుల్లో నెమ్మదిగా పురోభివృద్ధి పొందుతారు.
2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారంనాడు 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి సువర్ణగన్నేరు పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. 2015 వరకు సామాన్యంగా ఉండగలదు. 2015 నుంచి రవి మహర్దశ ఆరు సంవత్సరాలు, చంద్రమహర్దశ పది సంవత్సరాలు సత్ఫలితాలను ఇస్తుంది.