మీరు త్రయోదశి శుక్రవారం, వృషభలగ్నము, పుబ్బ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. 2012 ఆగస్టు వరకు శని ప్రభావం ఉండటం వల్ల మంచి మంచి అవకాశాలు చేజారిపోవడం వంటి చికాకులు ఎదుర్కొంటున్నారు. 2013 లేక 2014 నందు ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థిరపడే అవకాశం ఉంది. సంకల్పసిద్ధి గణపతిని పూజించినా సర్వదా శుభం కలుగుతుంది.
మీ భర్త వెంకటకిరణ్, ఏకాదశి శనివారం సింహలగ్నము, ఆరుద్ర నక్షత్రం, మిథునరాశి నందు జన్మించరు. 2012 ఆగస్టు వరకు శని ప్రభావం ఉండటం వల్ల ఒత్తిడి చికాకులు వంటివి ఎదుర్కొంటున్నారు. ప్రతీశనివారం 18 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి 18 ఒత్తులు ఏకం చేసి నువ్వుల నూనెతో శనికి దీపారాధన చేయండి. రాజ్యస్థానము నందు రాహువు ఉండటం వల్ల, మీరు ప్రైవేట్ రంగాల్లో బాగా రాణించి 2013 నందు బాగా స్థిరపడతారు. రాజరాజేశ్వరిని పూజించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.
మీ కుమార్తె శ్రీ చందన: త్రయోదశి శనివారం, సింహలగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ మాసశివరాత్రికి ఈశ్వరునికి అభిషేకం చేయించినా మీకు శుభం కలుగుతుంది. అష్టమ స్థానము నందు బుధ, శుక్ర, కుజ, గురు, చంద్రులు ఉండటం వల్ల మీరు వైద్య రంగాల్లో బాగా రాణిస్తారు. 25 లేక 26వ సంవత్సరము నందు బాగా స్థిరపడతారు. ప్రతీరోజు వరసిద్ధి వినాయకుడిని పూజించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి.